Sri Vasudevananda Saraswati -
(Tembeswamy)
Sadhguru Charitra
(This document is based on the points noted from the book while reading. There is no particular order)
- · Original book written in Marathi (On 19th Aug 1954) by Sri Dattatreya Dhundiraja Kaveeswar.
- · Telugu Translation done by GVLN Vidyasagara Sarma in 1987
- · This book ideally to be read as 7 Days Parayana
- · Vasudevananda Tembe Grand Father is Haribhat Tembe.
- · Father - Ganeshbhat Tembe
- · Mother - Ramabai
- · Vasudev Tembe born on Sravana Bahula Panchami – 13-Aug-1854 in Mangaon, Maarashtra
- · Wife - Annapoorna bai. (In Maharashtra woman’s name changes after marriage)
- · Datta Mandir in Mangaon in 1883 – 8 Hr from Pune, 7 Hr from Mahabaleswar – 12 Hr from BLR
- · Sawantwadi (14 Km from Mangaon)
- · Narasobawadi - 4 hr from Mangaon
Vasudevanana Tembe later was called by Vaudevananada Buva (it's a term of respectful address for an elder in Marathi). Once he moved out of Mangaon to become saint – he never visited his birth place never. His Guru is – Govinda Swamy and Also, he was a disciple to Mouniswamy
Lineage
of Tembe Swamy comes as follows
Sri Achyutannada Saraswati Swamy (శ్రీ అచ్యుతానంద సరస్వతీ స్వామి ) –
Sri Anirudhananda Saraswati Swamy (శ్రీ అనిరుద్ధానంద సరస్వతీ స్వామి ) –
Sri Narayananda Saraswati Swamy – (శ్రీ నారయాణానంద సరస్వతీ స్వామి –
Sri Vasudevananada Saraswati Swamy – (శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి)
·
He
took Sanyasa deeksha -at Ujjain. He did His - 1st Chaturmasam at Ujjain. Henceforth He is called as Maharaj (మహరాజె యోగిరాజ్)
·
He
is peer to Akkalkot Swamy, Shirdi Sai Baba
This
book narrates how Maharaj is always on move and how he has literally walked all
over and describes 100s of places he has visited. He never used Train or Bus or
Car or even bullock cart. He has toured across India 3 times, did 23 Chaturmasa
Deekshas. The book is completely depicting the various miracles Maharaj has
demonstrated. The miracles range from curing a simple disease to giving back
life to the dead ones. But he never used his powers for his self-purposes.
Maharaj
has written many books and slokas. Below are the main Books.
గురు చరిత్రను రాసినది, దానికి ద్వి సహస్రి టీకా తాత్పర్యము చెప్పినది ఈయనే.
1 1. గురుచరిత్ర (సంస్కృతం లో)
2 2. గురు చరిత్ర (ద్వి సహస్రి టీకా తాత్పర్యము)
3.
నర్మదా లహరి
4.
దత్త లీలామృత సింధు (ప్రాకృత భాష లో)
5.
దత్త మహత్యము (ప్రాకృత గ్రంధము).
6.
త్రిశతి గురు చరిత్ర (300 శ్లోకాల
సంస్కృత గ్రంథము)
7.
6750
శ్లోకాల సమస్లోకి గురుచరిత్ర.
8.
లఘు మననసారం (వేరాంత గ్రంథం)
9.
సప్తశతి గురు చరిత్ర (ప్రాకృత భాష లో)
10. కృష్ణా లహరి
(గానుగాపురంలో 51 స్తోత్రములతో
కృష్ణా మాత ఎదురుగా ప్రత్యక్షముగా గానము చేసిరి)
11. దత్త చంపువు
12. స్తోత్రాది సంగ్రహము (మహారాజ్ చెప్పిన శ్లోకములన్నీ ఇటీవల ముద్రించబడినది)
13. కుమార శిక్ష
14. గురు చరిత్ర మూల గ్రంథము యొక్క యధాతధ వచన భావము చూర్ణిక
15. యోగ శిక్ష
16. వృద్ధ శిక్ష
17. స్త్రీ శిక్ష
18. శ్రీ దత్తస్తవ స్తోత్రం
19. పట్పంచ శిఖా (వేదాంతపరమైన స్తోత్రము)
20. ఆత్మానాత్మ విచారము (ప్రాకృత భాషలో)
21. చిత్త షడ్భోధ నక్షత్రమాల
22. దత్త భావ సుధా రసము (గురు చరిత్ర సమస్త కథాసారము)
కృష్ణాలహరిలోని ఒక ప్రార్ధనా శ్లోకము.
ఓ
కృష్ణామాతా! సహ్యాద్రి నీ జన్మస్థానము. అదే నీ ముఖము.
నరసోబావాడి నీ
దయాపూరిత హృదయము.
ఆంధ్రదేశములోని కురువపురమే నీ
నాభి.
ప్రాచ్య సముద్రమును చేరుముందు హంసలదీవి దగ్గర రెండుగా చీలిన పాయలే నీ
పాదములు.
ఇట్టి నీ
రూపము జగత్ ప్రసిద్ధమైనది.
నీ
రూపము నా హృదయములో స్థిరముగా నుండు గాక!
శ్రీ దత్తప్రభువునకు ప్రీతిపాత్రమైన వారిచే సన్మానించబడుచు,
భక్తుల పాపాలను లోపాలను హరించెడి ఓ
తల్లి! నీకు నమస్కారము.
భారత దేశం అంతా ఆయన 3 సార్లు పర్యటించారు.
ఆయన జీవితమంతా కాలి నడక ప్రయాణమే.
ఆయన తిరిగిన ప్రదేశాలు. మచ్చుకు కొన్ని.
- మనకు తెలిసిన పేర్లు
(తెలియని ప్రదేశాలు / స్థలాలు ఇంకెన్నో ఇక్కడ పొందుపర్చలేదు)
వీటిలో చాల
చొట్ల చాతుర్మాస దీక్ష చేసారు - చివరికి
సీమోల్లంఘన పద్దతిగ చేసేవారు
1. 1. మణగావ్
2.
సావంతవాడి
3. నరసిమ్హ వాడి
/ నరసోబావాడి (బ్రహ్మానంద మఠములో ఉండేవారు).
శ్రీ నారాయణ స్వామి ఉత్సవాలు నరసోబా వాడిలో ప్రతి సంవత్సరం చైత్రమాసమున జరుగును. మహారాజు గారి పాదుకలు నరసింహ వాడి సమీపంలోని అమరేశ్వర మఠంలో ఉన్నవి ఇప్పటికీను.
4.
ఇండోర్
5.
ఉజ్జయిని
6.
గోకర్ణ
7.
హరిద్వార్
8.
ఆయన హిమాలయాల లో తిరిగారు. (చలిలో కేవలం అంగ వస్త్రముతోనే)
9.
చార్ధామ్, హరిద్వార్, ఋషికేష్ రుద్ర ప్రయాగ, ఉత్తరకాశి తిరిగారు.
10. ఆయన ఎక్కువగా ఉన్నది బ్రహ్మావర్తము లో (రెండున్నర సంవత్సరాలు).
11. ఓంకారేశ్వర్
12. గిర్నార్
13. ద్వారక
14. ప్రభాస్ తీర్థం
15. కుచేలపురం (పోర్ బందర్)
16. అక్కల్కోట్ (స్వామి దర్శనం)
17. గానుగాపురం (దత్త పాదుకల దర్శనం మరియు దత్త దర్శనం)
18. పర్లి వైద్యనాథ్
19. మాహూర్ (రేణుకా మాత, దత్త దర్శనం)
20. అవుంద్ (నాగనాథ్ దర్శనం)
21. ప్రయాగ
22. కాశి
23. కురుగడ్డ (కురువపురం)
24. కరంజా (శ్రీ నరసింహ సరస్వతీ జన్మస్థలం)
25. తుంగభద్రా తీరమునగల హంపీ క్షేత్రము
26. విద్యారణ్య స్వాముల వారి మఠమును (శృంగేరి)
27. ఋష్యమూక పర్వతము
28. పంపాసరోవరము
29. కిష్కింద
30. శేషాచల పర్వతము
31. శ్రీ రంగము
32. వేంకోబా కొండ ((తిరుమల) లో స్వామి స్పర్శ దర్శనము ఉండదు. కానీ మహారాజు గారి
ని చేయనిచ్చేవారు)
33. చిదంబర క్షేత్రం
34. శ్వేతారణ్యము
35. కుంభకోణం
36. మధుర మీనాక్షి
37. రామేశ్వరం
38. తంజావూరు
39. సత్యమంగళ
40. జంబుకేశ్వర్
41. కోటిలింగ
42. శ్రీరంగము
43. కరూర్
44. నేరూర్ (నేరూర్ - శ్రీ సదాశివబ్రహ్మేంద్రస్వామి మహారాజ్ యొక్క సజీవ సమాధి. ఆయన గురువు శ్రీ పరమశివేంద్ర సరస్వతీ.
స్వామి సదాశివ బ్రహ్మంగారు తెలుగువారు త్రైలింగ స్వామివారి వలనే)
45. త్రిపురాపురము
46. కాళహస్తి
47. శ్రీశైల పర్వతం,
శ్రీశైల మల్లికార్జున్.
48. ముక్తేశ్వరపురం (ముక్త్యాల) ఆంధ్రదేశములో కృష్ణా మండలమున నందిగామ తాలూకాలో కృష్ణా నదీతీరమున ఆ గ్రామం ఉండెను.
49. అమరావతి, వెల్లటూరు, హంసలదీవి - కృష్ణానది సముద్రంలో సంగమించు ప్రదేశము - కృష్ణా సాగరం అని అంటారు.
50. మచిలీపట్నం దగ్గరగా ఉన్న పెద్ద కల్లేపల్లి, నాగేష్
51. రాజమహేంద్రవరం దగ్గర వశిష్టుని కోటిలింగ స్థానము. విశిష్ట కౌశిక గౌతమి వృద్ధ గౌతమి భరద్వాజ ఆత్రేయ తురీయ అని ఏడుపాయలకు పేర్లు.
సప్త గోదావరి అని పేరు
52. రాజమహేంద్రవరం లోని గోదావరి గట్టున గల శృంగేరి శారదా పీఠంలో దత్త విగ్రహమును ప్రతిష్టించితిరి. ఈ విగ్రహం పేరు భక్తవత్సల దత్తాత్రేయుడు. ఇది బ్రహ్మానంద సరస్వతి గారు దగ్గరుండి మహారాజ్ చే చేయించారు..
53. వేద వాడపల్లి , కోగూరు (కొవ్వూరు)
54. పిఠాపురం (శ్రీ పాద శ్రీ వల్లభుల జన్మస్థలం)
55. కాకినాడ
56. ఇభేశ్వర్, భీమేశ్వర్.
57. బెజవాడ,
58. మంథని, కాళేశ్వరం. మంథని కి మిగిలిన పేర్లు మంత్రపురి మంత్ర కూటము మంథెన్న మంథెన మంథని
59. పండరీపురం
60. ధార్వాడ
61. హవనూరు
62. హవేరి
63. రాణి బెన్నూర్
64. బనవాసి
65. సిరసి
66. సిద్దేశ్వరం
67. గోకర్ణం
68. కోటి తీర్థం
69. కురుగడ్డ
70. మంజీరా
71. దౌలతాబాద్
72. ఘృశ్నేశ్వర్
73. ఖేడ్
74. చిఖల్ దా
75. అశ్వద్ధామ దారి చూపగా చివరికి గరుడేశ్వర్. గరుడేశ్వర్ గుజరాత్ లోని బరోడాకు 50 మైళ్ళ
దూరంలో ఉన్నది.
ఇక్కడ గరుత్మంతుడు శంకరుని ప్రసాదమునకై తపస్సు చేసెను. అందులకే ఆ ఊరికి ఆ పేరు వచ్చెను.
మహారాజ్ ప్రయాణాలన్నీ దత్తప్రభు ఆజ్ఞ మీదే జరుగుచుండెడివి.
కాశి పంచ క్రోస యాత్ర పూర్తి చేయలేకపోయారు - దత్తుని ఆజ్ఞ లేక.
దత్తాత్రేయుల వారు మహారాజు ఒడిలో ఆరు నెలల పసివాడుగా పడుకుని ఆడుకునేవాడు.
మహారాజు ఎల్లప్పుడూ చన్నీటి స్నానమే చేసేవారు. దత్తప్రభువు భక్తులు,
పూజారులు తనని పెట్టే కష్టాలను మహారాజుకి ఉదాహరణగా అనుభవించేటట్లు చేసేవారు.
మహారాజ్ స్మార్త బ్రాహ్మణులు. ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తూ వర్ణ ధర్మాన్ని, ధర్మానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. దానికి తగ్గట్టుగానే వారు అనుష్ఠాన పద్ధతులు పాటించే దక్షిణాది బ్రాహ్మణుల ఇళ్లల్లోనే బిక్ష స్వీకరించేవారు. గుజరాతి బ్రాహ్మణుల దగ్గర నుంచి బిక్ష తీసుకునేవారు కాదు.
వైష్ణవ బ్రాహ్మణుల ఇళ్లల్లో బిక్ష స్వీకరించేవారు కాదు.
వర్ణాశ్రమ ధర్మములు పాటించని వారికి మహారాజ్ దర్శనం లభించెడిది కాదు. వైష్ణవులకు శివ పంచాక్షరి స్తోత్రము ఉపదేశించి వారి జ్వరములను పోగొట్టిరి. ఇంటికి వచ్చిన అతిధికి బిక్షయే గృహస్థ ధర్మం అంతేగాని వచ్చిన వారి ఎక్కువ తక్కువ లెంచకూడదు.
తన సేవ కన్నను తన భక్తులకు చేయుసేవ పట్ల భగవంతుడు సంతుష్టి చెందును.
ద్వారకా శంకరాచార్య పీఠ ఆధిపత్యమును కూడా ఆయన స్వీకరించక సన్యాసత్వమునకు అసలు నిర్వచనము ప్రదర్శించినారు.
శృంగేరి పీఠానికి శంకరాచార్యులుగా ఉన్న శంకర శాస్త్రి పూర్వాశ్రమంలో వాసుదేవానంద సరస్వతి గారికి శిష్యుడు. ఆయనే శంకర శాస్త్రికి చాలా విషయములు సూత్ర భాష్య గ్రంథము నేర్పించిరి.
వేల కొలది మహిమలు, వేల వేలకు మనుషులను ఉద్ధరించటం జరిగినది.
వాసుదేవానంద సరస్వతి మహిమలు లీలలు ఎన్నో ఉన్నాయి..
ఈయనకు ఎన్నో మహిమలు లభ్యమైనాయి, సంక్రమించినాయి. కానీ వాటిని ఎప్పుడూ స్వలాభానికి వాడుకొనలేదు. పేదరికంలోనే జీవించి ఉన్నారు. ఒకే చోట రెండు అవతారాలలో కనపడేవారు.
అకస్మాత్తుగా మాయమగుట, దూర ప్రాంతములకు స్వల్ప కాలములోనే చేరుకొనుట మొదలైన తాము సాధించిన సిద్ధులను మూడు సమయములలో మాత్రమే తాము ఉపయోగించినట్లు మహారాజ్ మాటల సందర్భంలో ఒకసారి వెల్లడించిరి
ఆయనకు అన్ని పురాణాలు జన్మతః సిద్ధించి, పురాణ శ్రవణం చేసేవారు. అలాగే జపతపాలతో, మంత్రములతో వైద్య సేవలు కూడా అందించేవారు. వ్యాధులకు ఔషధములు, గ్రహ పీడితులకు మంత్ర యంత్రములు ఇచ్చేవారు. ప్రశ్నలకు సమాధానాలు, జన్మ,లగ్నపత్రికలు చూడటం. ప్రవచనం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యములను పెంపొందించుట చేసేవారు.
లేఖలకు సమాధానాలు ఇవ్వటం చేసేవారు.
మహారాజ్ కి జ్యోతిష్యం పై కూడా పట్టు ఉన్నది. కొందరికి కావ్యములు , మరికొందరికి భాగవతము, కొంత మందికి పంచదశి, కొందరికి నిత్య కర్మ మొదలగునవి వారి ఇష్టానుసారము మహారాజ్ నేర్పెడివారు.
ఆయనకు తరచుగా కడుపు సంబంధిత, జీర్ణ సంబంధిత అనారోగ్యము ఉండేది. అజీర్ణవ్యాధి (సంగ్రహణ వ్యాధి) వలన తరచూ శౌచమునకు వెళ్లవలసి వచ్చెడిది. దాని వలన ఆయన రోజులో తరచూ స్నానములు చేయవలసి వచ్చేది. ఎన్నిసార్లు శౌచముకు వెళ్ళవలసి వచ్చినా మందులు వేసుకునేవారు కాదు.
కేవలం మజ్జిగ త్రాగేవారు.
సన్యాసులు తల్లి కోసం వెళ్ళరాదు.
కానీ తల్లి కనిపించిన నమస్కరించవలెను.
తమ జన్మభూమికి తరచు వెళ్ళరాదు. దాని పై మమకారంతో అక్కడే ఉండిపోవచ్చు అందులకని.
నిర్గుణ ఉపాసన చేసినంత మాత్రాన సద్గుణ ఉపాసన మానవలసిన అవసరం లేదు సన్యాసులకు.
మహారాజ్ సద్గుణ ఉపాసన మిక్కిలి అధికముగా చేసెడివారు. దత్తుడు ఆయనతో అనునిత్యం సంభాషణ చేస్తుండేవారు. అందుకని ప్రతిదీ దత్తుని ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటుండేవారు. ఉపవాసము సమయమున మజ్జిగ ఒకటి రెండు ఫలములు మాత్రమే స్వీకరించెడివారు.
పుస్తకములో చాలా చోట్ల పిశాచాల సంబంధించి చర్చలు సంభాషణలు ఉండటం, మహారాజ్ వాటితో మాట్లాడటం జరుగుతుంది, చూపించడం జరిగినది.
ప్లేగు వ్యాధి కూడా మహారాజుకు సోకినా ఏమీ చేయలేక ఆ వ్యాధి వెళ్ళిపోయెను.
ఆయన చేసిన నామ సప్తాహాలు
- · శివ శివ శంకర గౌరీ శంకర
- · హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
- · శ్రీపాద శ్రీ నరసింహ స్వామీ శ్రీ మద్దత్తాత్రేయ మౌనీ
- · గణేశ గౌరీ హరనందన
విఘ్న వినాశన గజాననా
- · హరి హర గణపతి భాస్కర శక్తి స్వరూప ఈశో వరదో జయతి
- · జయ పురుషోత్తమ శరణద సత్తమ
- · శివ హర శంకర గౌరీ శంకర
- · దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
- · బాగీరధీ నది జయ పావనగంగే జాహ్నవి తారయ పాతక భంగే
ఆయన వందల కొలది శిష్యులకు రకరకాల విషయాల మీద తర్ఫీదును ఇచ్చితిరి. ఇందూర్ నుండి సఖరాం శాస్త్రిటిల్లు, హింగోళి నుండి హనుమంతశాస్త్రి, బ్రహ్మావర్తము నుండి నానాశాస్త్రి, గుజరాత్ నుండి గాండాబువా, మహారాజ్ పూర్వాశ్రమ బంధువులైన సీతారాంబువా, నానాసాహెబ్, నరసోబావాడీ నుండి నందిగాఁవ్కర్, గణపతి బువా,
గాండా బువా, శ్రీ నరసింహ సరస్వతి (దీక్షిత స్వామి - నరసింహ వాడి మందిరమును చూసుకుంటూ ఉండేవారు), గాండా బువా (సన్యాస అనంతరం యోగానంద సరస్వతిగా గుంజగావ్ లో నివసించుచుండెడివారు),
గోపాల్ బువా …...
స్వాములవారులు హృదయ స్థానంలో ఉండవలెను కానీ (ఫోటో) కాగితం మీద కాదు - అని ఆయన అనేవారు
సాధువులను అవహేళన చేసిన దోషము ఎవరైనను అనుభవించక తప్పదు
శాస్త్ర విరుద్ధమైన ప్రవర్తన గలవానిని సాధువు అని అనరాదు.
మహారాజ్ సాయిబాబా సోదర సమానులుగా భావించేవారు.
పంచదార , కొవ్వొత్తి పరదేశము నుంచి వచ్చినవి కాబట్టి నిషేధము. పరదేశము నుంచి వచ్చిన కర్పూరం కూడా నిషేధం.
హిందుస్థానకు స్వరాజ్యము ఇప్పటి లో రాదని వారు చెప్పేవారు. దానికి తగినటులనే వారి జీవితకాలంలో స్వరాజ్యం సిద్ధించలేదు.
శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతీ మహారాజ్ 23 చాతుర్మాసములు పూర్తి చేసుకునిరి. ముమ్మారు అసేతు హిమాచలం పర్యటించి దత్త సంప్రదాయమును దేశమున స్థాపన మొనరించుటకు కాలినడకన తిరిగారు.
మహారాజ్ దివ్యసందేశం
నీవు కోరుకోనునదేదియును చేయకము.
అప్పుడు నీకు
నచ్చినది చేయవచ్చు.
అంటే అహంకారమును
జయించుట ద్వారా
ఆత్మ విముక్తి
పొందుటకు దారి
చూపించుననెడి తత్వ
రహస్యమును బోధించుచున్నదని అర్థము
ఇంత కాలము మీకు ప్రత్యక్షముగా బోధించితిని. మీకై ఎన్నియో గ్రంథములు వ్రాసితిని. వాని సారమంతయు ఇప్పుడు మీకు చెప్పెదను. సావధాన చిత్తులై వినుడు!. మానవ జన్మమెత్తినందుకు ముక్తిని సాధించుటకై ప్రయత్నించుట మన అందరి ప్రథమ కర్తవ్యము. అందుకై మొదట మనస్సును స్థిరము చేసికొనవలెను. ఆ యుద్దేశముతో వర్ణాశ్రమ విహిత ధర్మమును శాస్త్రానుసారముగా మనమాచరించవలెను. వేదాంత శ్రవణము, మననము, నిధి, ధ్యాస నిత్య మభ్యాసము చేయవలెను. అందులొ ముఖ్యముగా శ్రణముపై మనస్సు నిలుపవలెను.
అందువలన మనస్సులోని ఆసక్తి తొలగిపోవును. సాత్త్యిక ప్రవృత్తి వలన మానవపుడు ఉన్నతి సాధించును. సాత్విక ప్రవృత్తి కలుగుటకు ఆహారము హితముగా, మితముగా, మేధ్యముగా (పవిత్రముగా) నున్నదో? లేదో? చూచి స్వీకరించు చుండవలెను. మన ప్రవృత్తి సాత్త్వికముగా నున్నదో? లేదో? కొన్ని లక్షణములను బట్టి మనమే గ్రహించవచ్చును. మగ వారిలో - స్వధర్మము మీద శ్రద్ధ కలుగుట, స్నాన సంధ్యలు చేయుట, దేవీపూజ, పంచ మహాయజ్ఞములు సకాలమున చేయుట, అతిధి సత్కారము, గోసేవ, కథాకీర్తన భజన పురాణ శ్రవణము, అందరితో మృదువుగా సంభాషించుట, ఇతరులకు కష్టము, నష్టము కలుగకుండ మెలగుట, తల్లిదండ్రులను సేవించుట మున్నగు గుణములు కలిగియున్నట్లు కనిపించినచో వారి ప్రవృత్తి సాత్వికమైనదని చెప్పవచ్చును. ఇక ఆడవారిలో ప్రీతితో అత్తవారింటిలో కాపురము చేయుచు, పెద్దల ఆజ్ఞకు లోబడి నడచుచుండుట, ఏకాగ్రతతో పతిసేవ చేయుట ఇత్యాది గుణములు కలిగి యుండుట, వారి ప్రవృత్తి సాత్త్యికమైన దనుటకు నిదర్శనము. ఉదార పోషణకై వ్యాపారముగాని, వ్యవసాయము గాని, ఉద్యోగము గాని మరే వృత్తిని గాని చేపట్టినను, వేదవిహిత కర్మలు, గుర్వాజ్ఞ పాలనము, ఎన్నడును విడువరాదు. స్వకర్మ ననుష్టించుట వలన అంతఃకరణము పరిశుద్ధమగును. అంతఃకరణము శుద్ధమైనంతనే ఉపాసన స్థిరమగును. ఉపాసన స్థిరపడిన తరువాత మనశ్శాంతి దొరకును. ఆ విధముగా మనస్సు స్థిరపడి, ప్రశాంత మైనప్పుడు ఆత్మజ్ఞానము కలిగి మోక్షలాభము ప్రాప్తించును. ఆ ప్రకారము మహారాజ్ ఉపదేశ మొసగి సప్త భూమికలను అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు అత్యంత హృద్యముగా నెల్లరకు బోధించిరి. జ్ఞాన భూమిక లేడింటిని గురించి వరాహోపనిషత్తు నాలుగవ అధ్యాయమున నిట్లు వివరించబడినది.
1.
శుభేచ్ఛ - వైరాగ్య భావము కలిగి వేదాంత శ్రవణమున-కిచ్ఛ గించుట. 2. విచారణ
- సాధన చతుష్టయ సంపన్నుడై సన్న్యసించి వేదాంత విచారణ మొనర్చుట. 3. తనుమానిసి
- నిధి ధ్యాసలలో నున్న సూక్ష్మమైన మానసిక స్థితి ఇది! "నే”
నను అహంకారము నశించుచుండగా మరియొక వైపు మనస్సు క్రమముగా సూక్ష్మమగు చుండును. విషయాభిలాష సన్నగిల్లు చుండును. 4. సత్యాపత్తి
- రజస్తమస్సులు లేక, కేవల శుద్ధ సత్యముతో నుండుట. ఇతడు "బ్రహ్మ
విదుడు." 5. ఆసంసక్తి - అవిద్యా, తత్కార్యములయందాసక్తి లేకపోవుట. ఇతడు "బ్రహ్మ
విద్వరుడు", 6. పదార్థా భావన - బాహ్యాభ్యంతర పదార్ధములను కూడ నెరుగక, ఇతరులు పదే పదే చెప్పగా నెప్పటికో తెలిసికొనుట, ఈయన బ్రహ్మ విద్యరియుడు". 7. తుర్యగ - సదా బ్రాహ్మి స్థితిలో నుండుట. ఈయన "బ్రహ్మవిద్వరిష్టుడు". ఈ సప్త భూమికలు ఒక దానికంటే మరొకటి శ్రేష్టమైనవి. క్రింది భూమికలు సాధించుచు, క్రమక్రమముగా మానసిక స్థాయిని పెంపొందించుకొనుచున్న కొలది జ్ఞానము పెరుగుచుండును. మొదటి నాల్గు భూమికలు ఎవరైనను అధిరోహించ వచ్చును. ఆపై భూమికలు కష్ట సాధ్యములు. బ్రహ్మిస్థితి లభించు "తుర్యగ”
అవస్థయే. "సత్యం
జ్ఞానం అనంతం బ్రహ్మ" యునెడి
జ్ఞాన స్థితి. అదే శుద్ధబుద్ధముక్త స్థితి.
ఏ ఊరిలో నైనా పూజ కైకర్యాల మీద వచ్చిన ధనమును మిగలగా దానిని నరసింహ వాడి మందిరానికి పంపేవారు గరుడేశ్వర్ లో అతి సారా వ్యాధి వచ్చి ఒక నెల రోజులు బాధపడుచుండగా దత్తప్రభువు నేను ఇక్కడనే ఉందును అనగా అప్పటినుంచి మందిరమునకు వచ్చిన ధనమును గరుడేశ్వర్ మందిర అభివృద్ధికి కేటాయించేవారు
అచ్చట మంచి వ్యవస్థ జరుగవలెనన్న సంకల్పముతో బ్రహ్మానందస్వామి, మహరాజ్ ఆమోదముతో, ఐదుగురు సభ్యులతో నొక కమిటీని ఏర్పాటు చేసి నియమించెను. ఆ కమిటీలో మొదటివారు నృసింహ సరస్వతి. ఆయన ఆ కమిటీకి అధ్యక్షుడు. రెండవవారు రామచంద్ర విఠల్. ఆయన ఉపాధ్యక్షుడు. మూడవవారు పరశురాం కుబేర రాంభట్. ఆయన కోశాధికారి. నాలుగవ వారు అమృతరావ్ పురుషోత్తం సబ్నీస్. ఐదవ వారు లక్ష్మి శంకర్ హరిగోవిందాస్ ఠాణేదార్. ఆరవవారు ప్రద్యుమ్నానంద తీర్థ. ఆ చివరి ముగ్గురును వ్యవస్థాపకులు.
“ఈ దేహము వేగిరమే విడిచి పోగలదు. అందుచేత ఔషధము అవసరము లేదు. ఆది శంకరాచార్యుల వారు ముప్పది రెండు సంవత్సరములే జీవించిరి. ఆయనతో సరిపోల్చిన, ఈ శరీరము చాలకాలము (అరువది సంవత్సరములు) నిలచినది. ఈ దేహమును రెండుసారులు సర్పము కరిచెను మూడు పర్యాయములు మహామారి సోకెను. ఒకమాటు సన్నిపాతము వచ్చెను. మరొకసారి ప్లేగు సంభవించెను. రెండు సార్లు మహావ్యాధి కలిగెను. రెండు మారులు వ్రణములు పుట్టెను. ఇన్నింటితో బాటు నన్ను విడువక సంగ్రహణి వ్యాధి నిరంతరము నన్ను పట్టుకొని యుండనే యున్నది. గదా! అప్పుడు నాకెవ్వరు ఔషధము లిచ్చిరి? పుట్టినది లగాయతు నే నే వైద్యుని నమ్ముకొని యున్నానో, ఆ వైద్యుడే ఇప్పుడు గూడ నున్నాడు. వాని యిచ్ఛ ప్రకారమే జరుగును దీనికంత ఆలోచనలు రాద్ధాంత సిద్ధాంతములెందుకు” అని మహారాజ్ పలికేడివారు.
1914
ఆషాడ శుద్ధ పాడ్యమి మంగళవారం ఆరుద్ర నక్షత్రము రాత్రి 11:00 గురుమావులి
చిరవియోగము
మహారాజు మంగళ శరీరమును నర్మదా మాత గర్భంలో విడిచిపెట్టిరి.
మహారాజ్ వారు సాక్షాత్తు దత్త ప్రభువులు. శ్రీ నరసింహ సరస్వతీ తదుపరి జన్మ. ఈ గ్రంథమును సప్తాహముగా లేక రోజుకు ఒక అధ్యాయము చొప్పున 52 అధ్యాయములు
చదవవచ్చును.
గరుడేశ్వర్ లో జరిగే కొన్ని ఉత్సవాలు
/ ముఖ్యమైన తిథులు
గురు
పూర్ణిమ -ఆషాఢ మాస పౌర్ణమి.
గురు ద్వాదశి - కురుగడ్డ
/ కురువపురం దగ్గర శ్రీపాద శ్రీ వల్లభుల వారు కృష్ణానదిలో అంతర్దానమైనది. ఆశ్వీజ బహుళ ద్వాదశి.
గురు పాడ్యమి (శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన రోజు)
మహారాజ్
జన్మదినోత్సవము శ్రావణ బహుళ పంచమి.
పుణ్య తిధి ఆషాడశుద్ధ పాడ్యమి.
ఇందిరా బాయ్ హోల్ కర్ (అహిల్యబాయి హోల్కర్ అత్తగారు) గరుడేశ్వరములో నర్మదా నదికి స్నానాల రేవు, మణగావ్, కురుగడ్డ, కారంజా మున్నగు స్థానములలో మందిరములకు అనేక పర్యాయములు యధోచిత ధన సహాయం చేసిరి.
అనంత కోటి బ్రహ్మాండ నాయక,
రాజాధిరాజ, యోగి రాజ, పరబ్రహ్మ,
శ్రీ దత్తాత్రేయ, శ్రీ పాద శ్రీవల్లభ,
శ్రీ నరసింహ సరస్వతీ,
శ్రీ వాసుదేవానంద సరస్వతీ మహారాజ్ కీ జై.
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.
సర్వేజనా స్సుఖినోభవంతు
స్తోత్ర మంత్ర వివరములు
1. 1. వాసుదేవ ద్వాదశాక్షరీ (ఓం నమో భగవతే వాసుదేవాయ)
2.
గాయత్రీ (తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనఃప్రచోదయాత్.
3.
దత్తగాయత్రి (దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి త దత్తప్రచోదయాత్)
4.
నారాయణగాయత్రి (నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహిన్ని విష్ణు ప్రచోదయాత్)
5.
ఆంజనేయ మంత్రము (నమో భగవత ఆంజనేయాయ మహాబలాదు స్వాహ)
6.
ముండకోపనిషత్తు మంత్రం (తమేవైకం జానస్థాత్మాన మన్యావాచో విముంచడా మృతస్సైషసేతుశో)
7.
చండీనవాక్షరి (ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే)
8.
యజ్ఞహోమ మంత్రం (ఓశ్రావయ ఆస్తు శౌషట్ యజయే యజామహే వెషట్, తత్త్వమసి, ఖంబ్రహ్మ)
9.
దత్తాత్రేయ అష్టాక్షరి (ద్రాం దత్తాత్రేయాయ నమః)
10. శివమంత్రము (నమో భగవతే రుద్రాయ)
11. శివపంచాక్షరి (ఓం నమః శివాయ)
గురుసంహిత గ్రంథం చివర, ముగింపుగా శ్రీవాసుదేవానంద సరస్వతీస్వామి వారు పరమాద్భుతంగా దత్తస్తుతి చేశారు. శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామివారు ఈ కింది శ్లోకాన్ని ద్వాత్రింశదక్షరీ మహామంత్రంగా రూపొందించారు. ఇందులో అనేక దేవతలు శ్లేషగా స్తుతించబడ్డారు. ఆ శ్లోకం ఇది!
ఓం నమో భగవన్విశ్వహేతో బ్రహ్మేడితాజతే ।
మాలీనో విశ్వభృల్లీలావిహార్య స్యార్యభావనః ॥
ప్రణవ స్వరూపక పరబ్రహ్మ (నిర్గుణపరబ్రహ్మ), ఈశ్వర, నారాయణ, బ్రహ్మ, శ్రీకృష్ణ, శ్రీరామ, సూర్య, వాయు, అగ్ని, గణపతి, దత్త, దేవీపర్యాయములైన మహా మంత్ర దేవతాస్తుతి ఇందు ఇమిడివున్నది.
Shree Datta Mandir , Mangaon
Sree Kshetra Garudeswar
Sree
Kshetra Garudeswar, Tembe Swami Samadhi
🙏
🙏
🙏
By
Chandrasekhar Channapragada
Bengaluru
6th September 2025


No comments:
Post a Comment