Tuesday, August 11, 2020

ఆదివారము





 This article is Published in my College Magazine Taluk Junior College, Tenali January 1981 

                                        ఆదివారము

 చంద్రశేఖర్ చన్నాప్రగడ

  Sr. Inter M. P. (Eng)

 

         వారములలో కెల్ల ఉత్తమమైన వారం ఏమిటిఅంటే అందరూ  ఒక్కుమ్మడిగా "ఆదివారము" అంటారుఅఫ్ కోర్స్ రైల్వే  ఆర్టీసీ  ఇత్యాది ఉద్యోగస్థులకు ఇది వర్తించదు.   మిగిలినవారికి ఆదివారమంటే ఉన్నంత ప్రియం ఇక చెప్పనక్కరలేదుఅదేంటో జైలునుంచి క్రొత్తగా విడుదలైన ఖైదీలా సంబరపడిపోతారు.     ముఖ్యంగా విద్యార్థులు ఆదివారం వచ్చిందంటే పరమానందభరితులవుతారుసోమవారం నాడే ఆదివారం ఇంకా ఎన్ని రోజులకి వస్తుందో లెక్క వేసుకునే ప్రబుద్ధులున్నారంటే ఆశ్చర్యపోనక్కరలేదు!

 

           అందరి చేత అంతగా ప్రశంసించబడటానికి ఆదివారము యొక్క విశేషమే మిటి'సండే- హాలిడే' అవటానికి వారం ఎంత పుణ్యం చేసుకున్నదో కదా వారానికి పట్టని మంగళహారతులు ఆదివారం కి పట్టడం విశేషం కదూ!   మిగిలిన వారంలో ఆదివారం కలియదుదాని  మార్గం వేరు ఆరోజు కార్యకలాపాలే వేరు.

 

            సండే' ని 'జాలీడే' గా హాయిగా విద్యార్థులు గడిపేస్తుంటారురాత్రంతా, అదీచాలక బారెడు పొద్దెక్కీం తరువాత కూడా నిద్రాదేవి ఒడిలో పవళించవచ్చుతల్లిదండ్రులు కూడాపాపం! బిడ్డడు రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతున్నాడు ఒక్క ఆదివారమన్నా హాయిగా నిద్రపోనిద్దాంఅనుకుంటారువాళ్ళకేం తెలుసు వాళ్ల పుత్రరత్నాలు చదివేది పైన పఠారం (టెక్స్ట్ పుస్తకాలు) లోన లొఠారం (డిటెక్టివ్ పుస్తకాలు) అనిక్లాసులు ఎగ్గొట్టి సినిమాలకి వెళ్లే బుద్ధి గల ఉత్తమ విద్యార్థులకి ఆదివారం చాలా అనుకూలంగా ఉంటుందిఎంచక్కా ప్రైవేట్ క్లాసులకని చెప్పి సినిమాల కెళ్లవచ్చు రోజుల్లో భూతద్దంలో వెతికినా వాళ్లకి మించిన ఉత్తమ విద్యార్థులు కనిపించరు సుమా!

 

         ఎంత పుస్తకాల ప్రేమికుడి కైనా మన పరిభాషలో చెప్పాలంటే ఎంత పుస్తకాల పురుగు కైనా ఆదివారం అంటే ఎంతో కొంత ఇష్టం ఉంటుంది. పుస్తకాలకి పూర్తిగా హత్తుకు పోవచ్చు. “స్ట్రైక్ లు,  ప్రిపరేషన్ హాలిడేలు రాజకీయ స్ట్రైక్ లుఉపన్యాసకుల (లెక్చరర్స్) సమ్మెలు  పోంగా కాలేజీలు శతదినోత్సవం కూడా చేసుకోవడం లేదుకాబట్టి  ఆదివారం కూడా పని దినమైతే బాగుండును!” అని  ఒకానొక నా ఫ్రెండ్ రహస్యంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. విషయమువాడి పేరు వెలుగులోకి వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా ! వాడు నడిరోడ్డు మీద సమస్త విద్యార్థులచే ఎముకల్లో క్యాల్షియం లేకుండా చేయించుకుని టౌన్ గంగ (మురుక్కాలవ) లోకి పోయి పడతాడుఏమైనప్పటికీ వాడి స్టేట్ మెంట్ మాత్రం బాగుంది. స్వర్ణోత్సవాలు చేసుకుంటున్న సినిమాలున్న రోజుల్లో కళాశాలలు కనీసం శతదినోత్సవాలకి కూడా నోచుకోకపోవడం విచారకరంఅయితే శెలవలకి పాఠ్యాంశాలకి అనులోమ సంబంధం ఉందనుకోండిశెలవులు పెరిగిన కొద్దీ పాఠ్యాంశాల వేగం కూడా పెరుగుతుంది.

 

      పూర్వం రోజుల్లో శనివారం సాయంత్రం కూడా సెలవు దినం గా ఉండేదికానీ తరువాత అది ఆగిపోయింది. మళ్లీ ఈమధ్య శనివారం కూడా సెలవు దినంగా ప్రకటిస్తారని  వదంతి ప్రారంభమైంది శుభ ముహూర్తం కోసం వేయికళ్లతోఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న విద్యార్థిహూ ! ఏమిటో? వాగ్దానాలు!”  అని వేదాంత ధోరణి లో మేళవించి వెల్లడించాడు.

 

     పల్లెటూళ్ళో పూర్వం రోజుల్లో ఆదివారం ఒక  పండుగ లాగా ఉండేదిచెఱువుగట్టు కెళ్ళడంఈత గొట్టడంతోట లో పడి జామకాయలు కోసుకుని తినడంబురదలో పొర్లాడటం ఇత్యాది కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేవాళ్ళురాను రాను పూర్తిగా మారిపోయి నేడు మన పట్టణాల్లో ఆదివారం నాడు రోడ్లమీద తిరగటంసినిమాలకెళ్ళడంసెంటర్ల లోనోసినిమా టాకీసు ముందో, నుంచోవడంనిటారుగా నిలబడ లేరేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకుని పడటంపక్కన పోయే వాళ్ళ మీద కామెంట్స్ చేయటం - అలా గడిపేస్తుంటారు. ఒక్క ఆదివారం నాడే కాదు ప్రతి రోజు అదే వాళ్ళ పని. ఆడవాళ్ళ మాటటుంచి, మగవాళ్ళకే అలాంటి స్టూడెంట్స్ ప్రవర్తన అసహ్యం కలిగిస్తుంటుంది.

 

 

     విద్యార్థినులు విద్యార్థుల్లాగా ఆదివారం నాడు బీభత్సం చేయక  పోయినప్పటికీ - వాళ్ళూ కొన్నింటికి తీసిపోరు. ఎడతెరిపి లేకుండా నవలా రాణుల పుస్తకాలు చదవటానికోచింతపిక్కలాడటానికో కాలం అంతా వృధా చేస్తుంటారు. సద్వినియోగ మయ్యే పని ఒకటి కూడా చెయ్యరు.

 

         పెద్దవారు కూడ ఆదివారం విషయంలో తక్కువేమి తినరు. ప్రాతః కాలం ఎనిమిది గంటల వరకు ముసుకుదన్ని పడుకొనితన సంతానం కింద పడేసే పాత్రల ధ్వనికో  లేక సహధర్మచారిణి పని మనిషిని అడ్డం పెట్టుకుని తన్ని తిట్టడం ప్రారంభించినప్పుడో   తీరిగ్గావిసుగ్గా లేస్తాడు.  “ఛీ! ఛీ! పాడు సంతానం ఆదివారమన్నా  సుఖంగా నిద్రపోనియ్యరు” అని స్తోత్రం పఠించి ధూమపానం సాగిస్తాడుకొందరు ఇల్లాళ్లు భర్తని (కుంభకర్ణుడులాంటి) నిద్ర లేపడానికి. చెంబెడు నీళ్లుసారీచెంచాడు నీళ్లు చెవిలో పోస్తారుచెవిలో నీళ్లు పోస్తే ఎంతటి కుంభకర్ణుడైన క్షణాల మీద లేచి కూర్చుంటాడు. కావాలంటే 'ట్రై' చేసి చూడండి.

 

 

         ఇక లేచిం  తరువాత కాఫీ కోసం తైతక్కలాడతాడు. తను ఆలస్యంగా లేచి నందుకు సిగ్గు పడటానికి బదులు  “పాల కుర్రాడు ఇంకా రాలేదేం” అంటూ చిందులు తొక్కుతాడు. పాపం కుర్రాడు మాత్రం ఆదివారం సద్వినియోగం చేసుకోవద్దుఅదేం  పట్టించుకోరు.  'ఎదుటివాళ్ళ బాధలు కట్టి పడేయి, స్వ సుఖాలు కూడా బెట్టవోయి' అనే మనస్తత్వం గల వాళ్లే వీళ్ళందరూను.

 

         అయస్కాంతం లాంటి భార్య ఉన్నట్టైతే ఆదివారం అంతా ఇంట్లోనే గడిపేస్తారుసూర్యకాంతం లాంటి భార్య అయితే మటుకు ఇక వాళ్ళ తిప్పలు చెప్పనక్కరలేదు. 'గయ్యాళి గంగమ్మ’ పోరు తప్పించుకోవడానికి రోడ్లమీద పడతారులంచ్ టైంకి ఇంటికొస్తుంటారుఇక రాత్రుళ్ళు సురాపానం  లో మునుగుతారునేడు మన సమాజంలో ఇదొక ఫ్యాషన్ గా తయారయిందిఈమధ్య ఒకానొక సర్వేలో తేలిన విషయమేమిటంటే బార్ లు  బీరుబాబుల తోను డోసుబాబుల తోను  ఆదివారం కళకళలాడుతుంటాయ్ఒళ్ళుఇల్లు గుల్ల చేసుకొంటు రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకుంటారుతిక్కగా ఉంటే భార్య ని రెండు తిట్టడంకొట్టడం లేక మత్తుగా ఉంటే వీధిలోనే పడుకోవటం చేస్తారు. మళ్ళా ఉదయం మాత్రం 'పాచిపళ్ళ దాస ' లాగాఏదో స్నేహితుల బలవంతం మీద కాస్త తీర్థం పుచ్చుకున్నానంతేలే !”  అని భార్యతో సర్థి చెప్పుకుంటారు

 

       ఇంట్లో ఇల్లాళ్ళు మాత్రం ఆదివారం వచ్చిందంటె హడలెత్తి పోతారురాక్షసి గోల పడలేక పిల్లలని తొందరగా బళ్ళో వేస్తుంటారుఆదివారం వచ్చిందంటే ఏముంది చిన్న పిల్లలతో పాటు పెద్ద పిల్లాడి (భర్త) గోల భరించాలిపెద్ద కొడుకు సినిమాకెళ్లడానికి పోపులడబ్బాలో ఉన్న డబ్బివ్వమంటాడు. పెద్ద కూతురు అద్దె పుస్తకాలు తెచ్చుకుంటానని మారాం చేస్తుంది. పిల్లలు సరే బిస్కట్లు.... చాక్లెట్లు,.  పోనీ తండ్రిని అడుగుతారా అంటే ! అడగరు వాళ్లకీ తెలుసు అది అడుక్కునే వాడి  దగ్గఱ గీక్కునే వాడి బేరం అవుతుందని.

 

         ఆదివారం అంటే ఇల్లాళ్ళ కే కాక పెద్ద పెద్ద ఆఫీసర్లకి కూడా  అఇష్టమేగుమస్తాల ముందు ' పులి ' లా తిరుగుతూఒక్క ఆదివారం నాడు మటుకు పిల్లయి  పోతుంటే మరి బాధపడిపోరునాకు ఆదివారం అంటే ఇష్టమే కానీ ఆదివారం కన్నా శనివారం చాలా ఇష్టంశనివారం నాడయితే రేపు శెలవు కదా అని ఉత్సాహంగా ఉంటుంది. ఆదివారం వచ్చేసరికి నీరుగారి పోతాం.  'రేపు సెలవు లేదు. మళ్ళీ మనం యంత్రాల్లాగా అయిపోవాలి' అని బాధపడి పోతాంఇటువంటి మనస్తత్వం చాలా మందికి ఉంటుందనే  నా ఊహ. అయితే  'రేపు మనది కాదు నేడే నిజం' అనేవాళ్లకు ఇదంతా చాదస్తం లా కనిపిస్తుంది.

 

          వారానికి ఒకరోజు సెలవు గా ఆదివారం ఇచ్చారు సరే దానికి కారణం ఏమిటి ? వారమంతా కష్టపడిన వాళ్ళకి కాస్త విరామంగా ఉంటుందనే,   అంతేగాని పూర్తిగా గా సోమరి పోతుల తయారు కావటానికి కాదు ఆరోజు కూడా తమ విధికి (విద్యార్థులు గాని ఉద్యోగస్థులు గాని) సంబంధించిన పనులు చూసుకోవాలి. చక్కటి విశ్రాంతిని పొందాలి. అమెరికాలో శనివారం కూడా సెలవు దినమేట. అక్కడి ప్రజలు నిరంతరం శ్రమిస్తారువారంలో  అయిదు రోజులు కష్టపడి పనిచేసి రెండు రోజులు సరదాగా గడుపుతారు. నూతన శక్తిని పొంది తిరిగి తమ పనుల్లో నిమగ్నమై రెట్టించిన ఉత్సాహంతో తమ బాధ్యతలు నిర్వర్తిస్తారుమన దేశ పౌరులు కూడా కష్టపడి పని చేస్తే మనం కూడా వారానికి ఆదివారాలు (సెలవలు) పొందవచ్చుకానీ మనం గుర్తించాల్సింది సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఒక ప్రక్క తగిన విరామాన్ని పొందుతూనే మన బాధ్యతలలోప్రవర్తనలతో ఎటువంటి సోమరితనాన్ని ప్రదర్శించకుండా జీవితంలో ముందుకు సాగాలి. ప్రతి పౌరుడు 'పంక్చువల్' గా ఉంటే నేడు దేశంలో నెలకొని ఉన్న 'అంతులేని’ అవినీతిని క్షణాల మీద  పారద్రోల వచ్చు.

 





No comments:

Post a Comment